హైదరాబాద్ : వైద్య రంగంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఇది రోగులకు ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ.
హైదరాబాదులోని AIG ఆస్పత్రిలో సౌత్ ఇండియాలో మొట్ట మొదటిసారిగా ప్రవేశ పెట్టిన అత్యాధునిక న్యూరో అంకాలజి డీప్ డైవ్ ZAP – X ఎక్విప్మెంట్ ను సంస్థ చైర్మన్ పద్మవిభూషణ్ డా. నాగేశ్వర్ రెడ్డి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. వైద్య రంగంలో ఆధునిక టెక్నాలజీ పెరిగిందన్నారు. ఎక్విప్మెంట్ కోసం వందల కోట్లు వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించారు . వైద్య రంగంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, HR లకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వైద్యానికి, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నామన్నారు దామోదర రాజ నరసింహ.
ప్రైమరీ, సెకండరీ, టెర్రిటరీ హెల్త్ విభాగాలను పటిష్ట పరుస్తున్నమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యుల కోసం ఉచితంగా NCD క్లినిక్స్ తో పాటు మొబైల్ స్క్రీనింగ్ సెంటర్స్ లను ప్రవేశ పెట్టామన్నారు. టీమ్స్ ఆసుపత్రి లను పాత పద్దతి లో కాకుండా కార్పొరేట్ తరహాలో ఆధునిక పరిజ్ఞానం తో సేవలను అందించేలా ఎక్విప్మెంట్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రం లో 104 ట్రామా కేర్ సెంటర్ లు 40 km పరిధిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు దామోదర రాజ నరసింహ. AIMS, కార్పొరేట్ ఆసుపత్రుల లో ఉండే సౌకర్యాలను ప్రభుత్వ ఆసుపత్రులలో కల్పించేలా చర్యలను చేపడుతున్నామన్నారు . అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన న్యూరో ఆంకాలజీ ఎక్విప్మెంట్ ను AIG ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు.















