Siva Shakthi Datta : హైదరాబాద్ – ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తండ్రి, సినీ, స్క్రీన్ ప్లే రచయిత కోడూరి శివశక్తి దత్తా అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని మణికొండలోని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. తన వయసు 92 ఏళ్లు. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నటీ నటులు తీవ్ర సంతాపం తెలిపారు. దత్తా మృతి తీరని లోటు అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి.
MM Keeravani’s Father Siva Shakthi Datta Death
ఇదిలా ఉండగా శివ శక్తి దత్తా (Siva Shakthi Datta) పలు సినిమాలలో సంస్కృత పాటలు రాశారు. ఈ రకంగా ఆయన గుర్తింపు పొందారు. అంతే కాదు బాహుబలి సినిమాకు కథ రాసిన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు సోదరుడు అవుతాడు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి స్వయాన పెదనాన్న అవుతారు కోడూరి శివ శక్తి దత్తా.
8 అక్టోబర్ 1932లో పుట్టారు శివ శక్తి దత్తా. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. స్వస్థలం ఏపీలోని రాజమండ్రీ సమీపంలోని కోవూరు. తండ్రి కోడూరి విజయ అప్పారావు. ఆనాడు 12 బస్సులతో రవాణా సంస్థను కూడా స్థాపించాడు.
శివశక్తి దత్తా ఏలూరు సి. ఆర్. రెడ్డి కళాశాలలో ఇంటర్ లో చేరినా మధ్యలోనే ఆపేశాడు. కళల పట్ల ముందు నుంచీ తనకు చచ్చేంత ఇష్టం. దీంతో ఇంట్లో చెప్పకుండానే ముంబైకి పారి పోయాడు. అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. పట్టా అందుకుని తిరిగి ఊరికి వచ్చాడు. కమలేష్ పేరుతో రచనలు రాశాడు. ఆ తర్వాత తన పేరును శివ శక్తి దత్తాగా మార్చుకున్నాడు. సితార్, గిటార్ నేర్చుకున్నాడు. అక్కడి నుంచి మద్రాస్ కు చేరుకున్నాడు. కొంత కాలం దర్శకుల వద్ద పని చేశాడు. పిల్లనగ్రోవి అనే పేరుతో సినిమా రూపొందించాడు. కానీ ఇది ఆర్థిక కారణాల వల్ల ఆడలేదు.
ఆ తర్వాత కె. రాఘవేంద్రరావుతో స్నేహం కుదిరింది. చిన్న చిన్న సినిమాలలో ఛాన్స్ లు ఇచ్చాడు. రాజన్న, బాహు బలి -1, బాహుబలి -2 , ఆర్ఆర్ఆర్ , హను మాన్ సక్సెస్ ఫుల్ సినిమాలకు రచనలు అందించాడు.
Also Read : PM Modi Sensational Comments : ప్రపంచానికి యుద్దం కాదు శాంతి కావాలి – మోదీ



















