MLC Sravan Kumar Fired on By Election : జూబ్లీహిల్స్ ఉప‌ ఎన్నిక‌ల్లో అక్ర‌మాల‌కు తెర లేపారు

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్

Hello Telugu - MLC Sravan Kumar Fired on By Election

Hello Telugu - MLC Sravan Kumar Fired on By-Election

Sravan Kumar : హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఈనెల 14న తుది ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఈ సంద‌ర్బంగా పోలింగ్ స‌ర‌ళిపై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ (Sravan Kumar). ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ ఎన్నికలను తలపించే రీతిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చిల్లర సంప్రదాయాలకు తెర తీశారని మండిప‌డ్డారు. ఇంత గుండాయిజం, రౌడీయిజం ఎప్పుడూ చూడలేద‌ని అన్నారు. ఇంత భీభత్సంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. ఓటుకు పదివేల దాకా, చీరలు కూడా లక్ష మందికి పంచార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార‌త‌ రాజ్యాంగాన్ని ఖూనీ చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఎమ్మెల్సీ.

MLC Sravan Kumar Key Comments

ప్రజలపై రేవంత్ రెడ్డికి విశ్వాసం పోయిందని, అందుకే అంతులేని అక్రమాలకు తెరలేపారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పండ్లు తోమినట్టు వ్యవహరించిందని ధ్వ‌జ‌మెత్తారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ పార్టీ త‌ర‌పున 20 ఫిర్యాదులు చేశామ‌న్నారు. బోగస్ ఓటింగ్ ఇంతగా ఎన్నడూ జరగలేదని అన్నారు. సబ్బండ వర్గాలు కేసీఆర్‌కు ఓటేస్తామని చెప్పాయని, బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసే రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డార‌ని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. త‌మ పార్టీకి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కూడా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని అన్నారు.

Also Read : Hydraa – High Court Shocking : ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు హైకోర్టులో చుక్కెదురు

Exit mobile version