గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయింపు

ధ‌న్య‌వాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాజ‌శేఖ‌రం

hellotelugu-PawanKalyan

అమ‌రావ‌తి : ఏపీ పంచాయ‌తీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారు ఎమ్మెల్యేలు. ఈ సంద‌ర్భంగా గ్రామాల అభివృద్దికి నిధులు కేటాయించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం డిప్యూటీ సీఎంను కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లెపండగ 2.0, సాస్కీ నిధులతో రోడ్లు, డ్రెయిన్లతోపాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు, పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్పీ భేటీ అనంతరం వీరంతా పవన్ కళ్యాణ్ ని కలిశారు.

కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు , మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు , ముమ్మడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు , అమలాపురం శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు, తదితరులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కలసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో రూ. 65.15 కోట్ల సాస్కీ నిధులతో 40 ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో మండపేట నియోజకవర్గానికి రూ. 22.75 కోట్లు, అమలాపురం నియోజకవర్గానికి రూ. 16.18 కోట్లు, కొత్తపేటకు రూ. 14.93 కోట్లు, ముమ్మిడివరం నియోజకవర్గానికి రూ. 11.28 కోట్లు కేటాయించారు. 216వ నంబర్ జాతీయ రహదారి నుంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్లే కరకట్ట రోడ్డు నిర్మాణానికి స్థానిక శాసన సభ్యులు సత్యానందరావు గారి అభ్యర్ధన మేరకు సాస్కీ నిధుల నుంచే రూ. 6 కోట్లు పవన్ కళ్యాణ్ మంజూరు చేశారు.

Exit mobile version