హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కన్నీటి పర్యంతం అయ్యారు. సోమవారం శాసన మండలిలో తను మాట్లాడారు. ఈ సందర్బంగా కన్నీటి పర్యంతం అయ్యారు. తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో జనంలోకి వెళుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్కార్ ను నిలదీస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న లోపాలను కూడా ఎత్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో మండలి సభ సాక్షిగా కల్వకుంట్ల కవిత కన్నీటి పర్యంతం అయ్యారు.
నా పోరాటం ఆత్మగౌరవం కోసమే తప్ప సంపద కోసం కాదని స్పష్టం చేశారు. నేను నమ్మే దేవుడి మీద , నా ఇద్దరు కుమారుల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు. బీఆర్ఎస్‌తో తనకున్న విభేదాల గురించి కాంగ్రెస్ పార్టీ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. దమ్ముంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలే తప్పా నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇకనైనా తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఇక నుంచి ప్రత్యక్షంగా యుద్దానికి సన్నద్దం అవుతామని ప్రకటించారు కల్వకుంట్ల కవిత.















