MLC Kavitha Shocking Comments : బీసీల‌కు న్యాయం చేసేంత దాకా పోరాటం

ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

Hello Telugu - MLC Kavitha Shocking Comments

Hello Telugu - MLC Kavitha Shocking Comments

MLC Kavitha : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బీసీల‌కు న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు తాను నిద్ర పోన‌ని ప్ర‌క‌టించారు. వారి కోసం ఎంత వ‌రకైనా పోరాడేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. సోమ‌వారం హైద‌రాబాద్ లో బీసీల కోసం బిల్లు ప్ర‌వేశ పెట్టాల‌ని, ఆమోదించాల‌ని కోరుతూ 72 గంట‌ల నిరాహార‌దీక్ష‌ను ప్రారంభించింది. వెంట‌నే 42 శాతం అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇవాళ తాను చేప‌ట్టిన దీక్ష‌, పోరాటం తెలంగాణ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోతుంద‌ని చెప్పారు. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి సంస్థ బాధ్యులు త‌ర‌లి వ‌చ్చారు.

MLC Kavitha Shocking Comments

ఈ సందర్భంగా దీక్ష‌ను ఉద్దేశించి క‌విత (MLC Kavitha) ప్ర‌సంగించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారంలో వాటా కావాల‌ని డిమాండ్ చేశారు. ఆర్థిక అవకాశాలు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారని.. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టినట్లు ప్ర‌క‌టించారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని అన్నారు. అందుకే తాను రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని వెంటాడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎవ‌రు వ‌దిలి పెట్టినా తాను వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు క‌విత‌.

ఇదే స‌మ‌యంలో క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు కేంద్ర స‌ర్కార్ పై. కావాల‌ని రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఆరోపించారు. ముస్లింల‌ను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. అయినా వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌న్నారు ఎమ్మెల్సీ.

Also Read : Minister Uttam Kumar Shocking Comments : కాళేశ్వ‌రం జ‌లాశ‌యం కేసీఆర్ దే పాపం

Exit mobile version