రేవంత్ రెడ్డి ఓ చ‌వ‌క‌బారు సీఎం : దాసోజు

సీఎం ప‌ద‌వికి పూర్తిగా అన‌ర్హుడ‌ని ఫైర్

hellotelugu-DasojuSravan

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శాస‌న మండ‌లి స‌భ్యుడు డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి అత్యంత దారుణంగా ఉంద‌ని, స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా తాను మాట్లాడుతున్నాడ‌ని ఆవేద‌న చెందారు. ఇవాళ దాసోజు శ్ర‌వ‌ణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. అస‌లు ఏఐసీసీ త‌న‌ను ఎంపిక ఎలా చేసిందంటూ ప్ర‌శ్నించారు. ఇలాంటి నీతి, గ‌తి త‌ప్పిన వ్య‌క్తిని ఎలా ప్ర‌మోట్ చేశారంటూ ఫైర్ అయ్యారు . ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సోయి త‌ప్పి, అదుపు లేకుండా నోటికి ఎలా ప‌డితే అలా ఇత‌రుల‌ను, త‌న స్వంత ఎమ్మెల్యేల‌ను సైతం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడ‌ని మండిప‌డ్డారు దాసోజు శ్ర‌వ‌ణ్‌.

పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ఇక‌నైనా మ‌రోసారి రేవంత్ రెడ్డి విష‌యంలో పున‌రాలోచించాల‌ని సూచించారు. నాలుగు కోట్ల ప్ర‌జానీకానికి జ‌వాబుదారీగా ఉండాల్సిన ముఖ్య‌మంత్రి ఇవాళ మ‌హిళ‌లు, చిన్నారులు, ప్ర‌జ‌లు సిగ్గుతో త‌ల దించుకునేలా కామెంట్స్ చేస్తుండ‌డం దారుణ‌మ‌న్నారు. ఇది పార్టీకి , మీకు మంచిది కాదంటూ సూచించారు డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. ఆయన ముఖ్యమంత్రా లేక చవకబారు మంత్రా అన్న‌ది అనుమానంగా ఉంద‌న్నారు. ఈ రోజు మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఒక పెద్ద హాస్యాస్పదంగా మారిందంటూ వాపోయారు. ఆయన ఒక సైకో. అలాంటి సైకో ముఖ్యమంత్రి ఇప్పుడు అసెంబ్లీలో తన తోటి ఎమ్మెల్యేలను దూషిస్తున్నారు… అహంకారంతో ఆయనకు కళ్ళు కనిపించడం లేదని ఆరోపించారు .

Exit mobile version