కరీంనగర్ జిల్లా : భారతీయ జనతా పార్టీకి చెందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు కలకలం రేపుతోంది. ఈ తరుణంలో ఇప్పటికే తనను అదుపలోకి తీసుకున్నారు. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్బంగా బీజేపీకి చెందిన నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వీరిపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీరికి తోడు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ కూడా నిందితుడికి వంత పాడుతూ ఉండడం పట్ల మండిపడుతున్నారు.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకులు మంచివారా కాదా అని మహా న్యూస్ ఛానల్ పోలింగ్ కూడా పెట్టింది. దీనిపై ఆర్ఎస్పీ సీరియస్ అయ్యారు. ఎండీ వంశీకృష్ణ జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా పోక్సో కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పందించారు. బండి భాగీరథ్‌పై నమోదైన POCSO కేసు వారి కుటుంబ వ్యవహారం అన్నారు. బాధితురాలైన బాలిక తల్లి కూడా, తన సొంత అన్న భార్యకు పెట్టినట్లుగానే భాగీరథ్‌కు కుంకుమ పెట్టిందన్నారు. తాను ఆ వీడియోలన్నీ చూశానని చెప్పారు. ‘మైనర్ బాలికపై అత్యాచారం’ వంటి పదాలను ఉపయోగించడం సరికాదన్నారు. మరో వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటం విస్తు పోయేలా చేసింది.
