MLA Prasanthi Reddy Warning : మ‌హిళ‌ల‌ జోలికి వస్తే ఊరుకుంటారా – ప్రశాంతి రెడ్డి

న‌ల్ల‌పురెడ్డి ఇంటిపై దాడితో మాకు సంబంధం లేదు

Hello Telugu - MLA Prasanthi Reddy Warning

Hello Telugu - MLA Prasanthi Reddy Warning

MLA Prasanthi Reddy : నెల్లూరు జిల్లా – టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి నిప్పులు చెరిగారు. మ‌హిళ‌లు అమాయ‌కుల‌ని, ఎలా ప‌డితే అలా మాట్లాడితే ఊరుకుంటారా అని ప్ర‌శ్నించారు. త‌న‌పై లేని పోని కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలి వేస్తున్నాన‌ని అన్నారు. బుధ‌వారం ప్ర‌శాంతి రెడ్డి (MLA Prasanthi Reddy) మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేత‌లు సోయి లేకుండా మాట్లాడుతున్నార‌ని, వారి ఇళ్ల‌ల్లో ఉన్న మ‌హిళ‌ల‌ను కూడా ఇలాగే మాట్లాడతారా అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌త్యేకించి న‌ల్ల‌పురెడ్డి ఇంటిపై తాము దాడుల‌కు దిగామ‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇదంతా పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్యే ప్ర‌శాంతి రెడ్డి.

MLA Prasanthi Reddy Warning

మహిళా ఎమ్మెల్యే, ఎంపీ భార్య అయిన నాపై మాట్లాడిన మాటలకు కడుపు మండి అభిమానులు దాడి చేసి ఉండొచ్చని ఇందులో త‌ప్పేముందంటూ ప్ర‌శ్నించారు. ఎవ‌రైనా స‌రే మ‌హిళ‌లను వ్య‌క్తిగ‌తంగా దూషిస్తే త‌ట్టుకోలేర‌ని అన్నారు. ఆత్మాభిమానం అనేది ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంద‌ని, దానిపై దెబ్బ కొడితే ఊరుకోర‌ని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌లేద‌ని, ఆ సంస్కృతి త‌మ‌ది కాద‌న్నారు. అయినా రాష్ట్రంలో పార్టీని న‌డిపే జ‌గ‌న్ రెడ్డి ఇలాంటి చిల్ల‌ర వేషాలు వేసే వారిని, అనుచితంగా మాట్లాడే వారిని ఎందుకు ప్రోత్స‌హిస్తున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని వేమిరెడ్డి ప్ర‌శాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటమి, నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ఫ్రస్టేషన్ లో ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Popular Actress – Indira Krishnan : త‌ల్లిగా న‌టించ‌డం అదృష్టం – ఇందిరా కృష్ణ‌న్

Exit mobile version