KTR : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). శనివారం ఉప్పల్ లో జరిగిన బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల రాజకీయ అక్రమ సంబంధం నిస్సిగ్గుగా నడుస్తోందన్నారు. బీజేపీ ఎంపీకి వందల కోట్ల కాంట్రాక్టును రేవంత్ కట్టబెడుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. సోనియా గాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో కూడా చదవడం రాని రేవంత్ రెడ్డి, అదే తనకు అస్కార్ అవార్డు అంటున్నాడంటూ ఎద్దేవా చేశారు.
KTR Shocking Comments
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యా రంగాన్ని సంపూర్ణంగా పతనావస్థకు చేర్చిన ఘనత సీఎంకే దక్కిందన్నారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్‌ను బీఆర్ఎస్వీలో విలీనం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముందో చదవడం రాక మురిసిపోతున్న రేవంత్ రెడ్డికి అస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి రాలేనని సోనియా గాంధీ చెప్పిన మాటను అర్థం చేసుకోలేక తనను ప్రశంసించిందని మురిసి పోతున్న సీఎంని చూస్తే జాలేస్తుందన్నారు.
సోనియా గాంధీ రాసిన లేఖను కూడా చదివే తెలివి రేవంత్ రెడ్డికి లేదన్నారు. రేవంత్ రెడ్డిని మాట మాత్రంగానైనా ప్రశంసించని సోనియాగాంధీ లేఖను చూసిన ప్రతి ఒక్కరూ సీఎం అజ్ఞానాన్ని, దీనస్థితిని చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లెటర్‌ను కూడా చదవలేని రేవంత్ రెడ్డికి దొంగ డిగ్రీ ఉందేమోనని పేర్కొన్నారు. తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్న రేవంత్ రెడ్డిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుతోందన్నారు.
Also Read : MP CM Ramesh Reject : రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అబద్దం – సీఎం రమేష్
