MP CM Ramesh : అమరావతి – తనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై సీరియస్ గా స్పందించారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. శనివారం ఏపీలోని అనకాపల్లిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి నాపై ఆరోపణలు చేయడం మూర్ఖత్వం తప్ప మరోటి కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి నేను కాంట్రాక్ట్ పొందానన్నది పూర్తిగా అవాస్తవన్నారు. అసలు ఆ కంపెనీకి నాకు సంబంధం లేదన్నారు.
MP CM Ramesh Rejected KTR Comments
ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెలితో పోరు ఉన్నట్టే తెలంగాణలో నీకు కూడా చెల్లెలి పోరుతో మతి భ్రమించి మాట్లాడుతున్నావంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎల్ అండ్ టీ, రిత్విక్ కంపెనీలకు వర్క్ కాంట్రాక్ట్ వచ్చి మూడు నెలల అయ్యిందన్నారు. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా అని నిలదీశారు కేటీఆర్ (KTR) ను. నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నీవు ఏం మాట్లాడవో గుర్తుందా అన్నారు.
మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపి పార్టీలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు అవునా? కాదా? అని సంచలన ఆరోపణలు చేశారు సీఎం రమేష్ (MP CM Ramesh). నేను మా పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని తెలంగాణలో మీ పని అయి పోయిందని కావున మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నావంటూ ధ్వజమెత్తారు. పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా అని ప్రశ్నించారు.
తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను అడిగితే మా పార్టీకి కమ్మ నా కొడుకులు అవసరం లేదని. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా లేదా అని ఆరోపించారు సీఎం రమేష్. మీ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంత మంది? ఆంధ్ర వాళ్ళు ఎంత మంది అన్నది నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.
Also Read : Center Govt Shocking Farmers : ఎరువుల సబ్సిడీని తగ్గించిన కేంద్రం
