Daggubati Prasad Shocking Comments : జూనియ‌ర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే బూతు పురాణం

ద‌గ్గుబాటి ప్ర‌సాద్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు క‌ల‌క‌ల‌కం

Hello Telugu - Daggubati Prasad Shocking Comments

Hello Telugu - Daggubati Prasad Shocking Comments

Daggubati Prasad : అమ‌రావ‌తి – జూనియర్ ఎన్టీఆర్ ను బూతులు తిట్టాడు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ . ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ అయ్యింది. వార్-2 సినిమా రిలీజ్ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగు యువత నేత ధనుంజయ నాయుడితో ఫోన్ లో మాట్లాడారు ఎమ్మెల్యే ప్రసాద్ (Daggubati Prasad). సినిమా ప్రదర్శనకు అనుమతి ఉందా అంటూ మండిప‌డ్డారు. వార్-2 సినిమా ఆడదంటూ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇలా రెచ్చి పోయి మాట్లాడటం ప‌ట్ల జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కావాల‌ని ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండి ప‌డుతున్నారు.

Daggubati Prasad Shocking Comments

ఇదిలా ఉండ‌గా జూనియర్ ఎన్టీఆర్ తాజాగా హృతిక్ రోష‌న్ తో క‌లిసి హిందీలో తొలిసారిగా వార్ -2 సీక్వెల్ సినిమాలో న‌టించాడు. ఇది ఈనెల ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ప్ర‌పంచ వ్యాప్తంగా . భారీ స్పంద‌న ల‌భించింది. అయితే అనూహ్యంగా వార్ -2 కి ఉత్త‌రాదిన అంత‌గా ఆక‌ట్టుకోలేదు. కానీ ఎవ‌రూ అనుకోని విధంగా తెలుగు రాష్ట్రాల‌లో వార్ -2 మూవీకి సూప‌ర్ టాక్ వ‌చ్చింది. దీనిని తెలుగు రైట్స్ ను భారీ ధ‌ర‌కు తీసుకున్నాడు నిర్మాత నాగ‌వంశీ. ఏకంగా రూ. 90 కోట్ల‌కు తీసుకున్నాడు. ప్ర‌ధానంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో తీసుకున్నా ఆ మొత్తం డ‌బ్బులు వ‌చ్చే ఛాన్స్ లేద‌ని, అయినా భ‌రించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాడు నిర్మాత‌. మొత్తంగా ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే నోరు పారేసు కోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది.

Also Read : Bigg Boss Winner Elvish Yadav Shocking : బిగ్ బాస్ విజేత ఎల్విష్ ఇంటిపై కాల్పులు

Exit mobile version