MLA Anirudh Reddy : పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలపై నిప్పులు చెరిగారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy). నర దృష్టి మీకు తాకుందంటూ పేర్కొనడంపై మండిపడ్డారు. నీకు తెలంగాణకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. ఇంకోసారి నోరు పారేసుకుంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు.
ఏపీలో నీకు సింగిల్ పోయే దమ్ము లేక పొత్తు పెట్టుకున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అనిరుధ్ రెడ్డి. అసలు మెగాస్టార్ చిరంజీవి అనేటోడు లేక పోతే నిన్ను ఎవడూ దేకడని ఎద్దేవా చేశారు. అప్పులు అన్నీ తీర్చేశావని, హైదరాబాద్ లో ఆస్తులు కొంటున్నావని ప్రచారం జరుగుతోందని మరి దీనికి సమాధానం చెప్పాలన్నారు.
MLA Anirudh Reddy Shocking Comments on Deputy CM Pawan Kalyan
తెలంగాణ ప్రజలంటే నీకు అంత చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు. నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లోఆస్తులు అమ్మేయాలని అన్నారు. ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావని నిలదీశారు జనంపల్లి అనిరుధ్ రెడ్డి. విజయవాడలో ఉండి ఏపీ ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా నీకు అంటూ సవాల్ విసిరారు. ఇంకోసారి గనుక తమ గురించి, తమ ప్రాంతం గురించి నోరు పారేసుకుంటే జాగ్రత్త అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కు.
Also Read : Minister Anitha Important Update on Cycone : తుపాను ప్రభావం అప్రమత్తత అవసరం
