BCCI : ముంబై : ప్రతిష్టాత్మకమైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మిథున్ మన్హాస్. ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ (BCCI) బోర్డు సమావేశంలో తనను ఎన్నుకున్నట్లు బీసీసీఐ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా మిథున్ మన్హాస్ లిస్ట్ ఎ మ్యాచ్‌లలో 27 సెంచరీలతో 9714 ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించాడు, వీటిలో 4126 పరుగులు ఉన్నాయి. ఢిల్లీ మాజీ కెప్టెన్ గా ఉన్నాడు. 70 ఏళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేసిన రోజర్ బిన్నీ స్థానంలో 45 ఏళ్ల మన్హాస్ బోర్డు 37వ అధ్యక్షుడయ్యాడు. 1997-98 , 2016-17 మధ్య 157 ఫస్ట్-క్లాస్, 130 లిస్ట్ ఎ , 55 ఐపిఎల్ మ్యాచ్‌లలో ఆడాడు మాజీ ఆల్ రౌండర్. ఈ నెల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన బోర్డు పవర్ బ్రోకర్ల అనధికారిక సమావేశం తరువాత ఏకాభిప్రాయంతో మన్హాస్ ఎంపికయ్యారు. ఆయన ఎన్నిక లాంఛనంగా జరిగింది.
BCCI New Chief Updates
ఇంత వరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా మన్హాస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యేంత వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తను బీసీసీఐకి 37వ ప్రెసిడెంట్ కావడం విశేషం. తన అనారోగ్యం కారణంగా ఉన్నట్టుండి రోజర్ బిన్నీ గత కొన్ని నెలల కిందట అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఇదిలా ఉండగా ఈ ఆశ్చర్యకరమైన పరిణామం దేశంలోని క్రికెట్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది, ఎవరూ దీనిని ఊహించ లేదు. మన్హాస్ స్వస్థలం జమ్మూ కాశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాలలో ఒకటైన దోడా జిల్లాకు చెందిన వారు. ఇదే ప్రాంతానికి చెందిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ది కూడా ఇదే ప్లేస్ కావడం విశేషం. బీసీసీఐ చీఫ్ గా ఎన్నికైనందుకు తనను అభినందించారు.
Also Read : Hero Ram Charan : సినీ రంగంలో రామ్ చరణ్ కు 18 ఏళ్లు



















