Mithun Chakraborty : ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) కీలక వ్యాఖ్యలు చేశారు. సూడో సెక్యులరిజంపై స్పందించారు. కొన్ని సినిమాలను ‘ప్రచార సినిమాలు’గా పేర్కొనడాన్ని ప్రశ్నించాడు. వివేక్ అగ్నిహోత్రి బెంగాల్ ఫైల్స్ ‘తెరపై సత్యాన్ని చిత్రీకరిస్తుంది’ అని పేర్కొన్నాడు మిథున్ చక్రవర్తి. 1946 కలకత్తా కిల్లింగ్స్ ఎట్ నోఖాలి పేరుతో సినిమా తీశాడు. సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రాకముందే వివాదాన్ని సృష్టించింది. దాని ట్రైలర్ విడుదల ఇటీవల కోల్‌కతాలో ఆగి పోయింది. ఈ సినిమాతో పాటు తన కెరీర్ తీసుకుంటున్న దిశ, భవిష్యత్తు కోసం తన ఆకాంక్షల గురించి ఈ అనుభవజ్ఞుడైన నటుడు మాట్లాడాడు.
Mithun Chakraborty Key Comments
ఇది కఠినమైనది కూడా. ఎందుకంటే ఈ సినిమా తెరపై సత్యాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నాడు.. ఇదంతా నేను పుట్టకముందే జరిగింది. ఆరు తరాల వారికి కథ తెలియదు. నాకు కూడా దాని గురించి ఒకే ఒక లైన్ తెలుసు అన్నాడు. ‘ది గ్రేట్ కోల్‌కతా కిల్లింగ్స్.’ ట్రైలర్ విడుదలను నిలిపి వేయడం ప్లాన్ చేసినట్లు అనిపిస్తుందని పేర్కొన్నాడు. చూడని దాని విడుదలను ఎందుకు ఆపాలి? మన దేశంలో జరిగిన దాని గురించి వాస్తవాలు తెలుసు కోవడంలో తప్పేంటి అని ప్రశ్నించాడు మిథున్ చక్రవర్తి. నోఖాలిలో జరిగిన మారణహోమంలో దాదాపు 40,000 మంది హిందువులు ఊచకోత కోయబడ్డారు. మన దేశ ప్రజలు మన స్వంత చరిత్ర గురించి నేర్చుకోవడానికి ఎందుకు అభ్యంతరాలు ఉన్నాయి అని పేర్కొన్నారు.
Also Read : Mahesh Kumar Goud Fired on Bandi : దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలుపు



















