Mirai : హైదరాబాద్ : టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్ (Mirai) రికార్డుల మోత మోగిస్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ మూవీ ఏకంగా వరల్డ్ వైడ్ గా రూ. 150 కోట్ల ను దాటేసింది. ప్రత్యేకించి అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకుంది. గత కొంత కాలంగా సక్సెస్ రాక నానా తంటాలు పడుతున్న నిర్మాతలకు ఈ చిత్రం బూస్ట్ కలిగించింది. ఈ చిత్రంలో హనుమాన్ హీరో తేజ సజ్జా,రితికా నాయక్ , మంచు మనోజ్ , జగపతి బాబు, శ్రియ శరణ్ నటించారు. ఇక ఈ వసూళ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో వైపు పవన్ కళ్యాణ్, సుజిత్ తీసిన మూవీ ఓజీ విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మిరాయ్ కి ఏ మాత్రం ఎఫెక్ట్ కనిపించడం లేదు.
Mirai Movie Collections
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం మూడు వారాల్లోనే సూపర్ కలెక్షన్స్ సాధించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన వాటిలో మిరాయ్ దుమ్ము రేపుతుండడంతో మూవీ టీం ఫుల్ ఖుష్ గా ఉంది. అమెరికాలో అత్యధికంగా వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా మిగిలాడు. మిరాయ్ ప్రేక్షకులకు అదనంగా జోడించని సీన్స్ ను కూడా తిరిగి చేర్చడంతో మరింత ఆదరణ పొందుతోంది. ప్రధానంగా యూట్యూబ్ ను ఇప్పటికే షేక్ చేస్తున్న సాంగ్ వైబ్ ఉంది బేబీ సాంగ్ ను చిత్రానికి యాడ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ మరోసారి సినిమా చూసేందుకు వస్తున్నారని తెలిపారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
Also Read : Beauty Samantha : అందం గురించి అంతగా పట్టించుకోను


















