Mirai : హైదరాబాద్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ మిరాయ్ (Mirai). ఇందులో తేజ సజ్జాతో పాటు మంచు మనోజ్, జగపతి బాబు, శ్రియ, రితికా రాథోడ్ నటించారు. ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ అయ్యింది. కేవలం 10 రోజుల్లోనే రూ. 134. 4 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటించారు నిర్మాతలు. బాక్సాఫీసుల వద్ద భారీ ఎత్తున మిరాయ్ వసూలు చేస్తూనే ఉంది. బహు భాషలలో ఇది స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు విశ్వ ప్రసాద్. ఇప్పటి వరకు వివిధ కారణాల రీత్యా థియేటర్లలో చూడలేక పోయిన ప్రేక్షకులకు తీపి కబురు అని చెప్పకతప్పదు.
Mirai Movie OTT Updates
ప్రస్తుతం 10 నుంచి ఓటీటీలోకి రానుండడంతో ఫుల్ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈ మధ్య కాలంలో విశ్వ ప్రసాద్ కు ఒకింత ఊరటనిచ్చింది ఈ సినిమా. తను గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్ ఆశించిన మేర ఆడలేదు. ఇందులో బాలీవుడ్ కు చెందిన భాగ్యశ్రీ బోర్సేను తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. రవితేజ చరిష్మా, దర్శకుడి డైనమిజం వర్కవుట్ కాలేదు. చివరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ మిరాయ్ నిర్మాతలకు పండుగ వాతావరణం తీసుకు వచ్చేలా చేసింది.
Also Read : Hero Vijay Deverakonda-Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా వైరల్

















