Mirai : హైదరాబాద్ : టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో భారీ ఖర్చుతో నిర్మించిన చిత్రం మిరాయ్ (Mirai). దీనికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. హనుమాన్ స్టార్ హీరో తేజ సజ్జా, రితికా నాయక్ , జగపతి బాబు, శ్రియా శరణ్ , విలన్ గా మంచు మనజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎవరూ ఊహించని పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.దీనిని భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్లు టాక్. ఇది పక్కన పెడితే తాజాగా మిరాయ్ సినిమాకు సంబంధించి నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. కేవలం విడుదలైన 10 రోజులలోనే 134.4 కోట్లు వసూలు చేసిందని ప్రకటించారు. ఆయన చేసిన ఈ ప్రకటన సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. దీనిని పూర్తిగా మైథలాజికల్ మూవీగా తెరకెక్కించాడు.
Mirai Movie Records
ఇక తేజ సజ్జా ఫాంటసీ కోలాహలం మిరాయ్ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది, విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం వివిధ ప్రాంతాలలో అద్భుతంగా ప్రదర్శించ బడుతోంది. అంతే కాదు రాబోయే రోజులలో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు సినీ వర్గాలు. మిరాయ్ అమెరికాలో రికార్డు బ్రేక్ చేసింది. $3 మిలియన్ల మార్కును చేరుకుంటోంది, ఇటీవలి సంవత్సరాలలో అత్యధికంగా ప్రదర్శన ఇచ్చిన తెలుగు చిత్రాలలో ఒకటిగా దాని స్థితిని సుస్థిరం చేసుకుంది. ప్రేక్షకుల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ, బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫామ్‌లలో పునరావృత వీక్షకుల సంఖ్య, బలమైన ముందస్తు బుకింగ్‌ల ద్వారా ఈ చిత్రానికి కాసులు కురిపించేలా చేస్తోంది.
Also Read : Popular Actor Unni Mukundan : ప్రధాని మోదీ పాత్ర పోషించడం అదృష్టం



















