Mirai Movie Success : మిరాయ్ విజువ‌ల్ వండ‌ర్ అందుకే స‌క్సెస్

సినీ నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ కామెంట్స్

Hello Telugu - Mirai Movie Success

Hello Telugu - Mirai Movie Success

Mirai : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మిరాయ్ (Mirai) దుమ్ము రేపుతోంది. విడుద‌లైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాను నిర్మించిన నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముందు నుంచి తాము మిరాయ్ ని ఒక విజువ‌ల్ వండ‌ర్ గా తీర్చి దిద్దాల‌ని అనుకున్నామ‌ని, అలాగే చేశామ‌న్నారు. హాలీవుడ్ స్థాయిలో ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డామ‌న్నారు. ఇందులో భాగం పంచుకున్న ప్ర‌తి ఒక్క‌రు వంద శాతానికి కంటే ఎక్కువ‌గా క‌ష్ట ప‌డ్డార‌ని అన్నారు. ప్ర‌ధానంగా తేజ స‌జ్జ‌తో పాటు విల‌నిజం పండించిన మంచు మ‌నోజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు టీజీ విశ్వ ప్ర‌సాద్.

Mirai Movie Updates

ఇదిలా ఉండ‌గా మిరాయ్ లో తేజ స‌జ్జా, రితికా నాయ‌క్, జ‌గ‌ప‌తి బాబు, శ్రేయ , మంచు మ‌నోజ్ కీ రోల్స్ పోషించారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా దుమ్ము రేపింద‌న్నారు నిర్మాత‌. మూడు రోజుల్లోనే రూ. 60 కోట్ల గ్రాస్ ను దాటేసింద‌న్నారు. రాబోయే రోజుల్లో ఈ క‌లెక్ష‌న్ల సంఖ్య మ‌రింత పెరిగే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌న్నారు. తేజ సజ్జా ఒక ప్రతిభావంతులైన నటుడు. హనుమాన్ తర్వాత మరో విజయాన్ని సాధించాడు. దర్శకుడు కార్తీక్ గొప్ప దృష్టిని కలిగి ఉన్నాడు. ప్రేక్షకులను ఆకర్షించడానికి ఉత్కంఠ భరితమైన విజువల్స్‌ను తీసుకు రావ‌డంలో స‌క్సెస్ అయ్యాడ‌ని ప్ర‌శంసించాడు విశ్వ ప్ర‌సాద్. సినిమా స‌క్సెస్ అయ్యింద‌ని తాము టికెట్ ధ‌ర‌ల‌ను పెంచాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు . హైదరాబాద్, బెంగళూరు, ముంబై అంతటా అద్భుతమైన పని చేసిన వందలాది మంది వీఎఫ్ఎక్స్ క‌ళాకారుల‌కు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే మరో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రాజా సాబ్ ఇస్తామ‌న్నారు.

Also Read : Mirai Huge Collections : మిరాయ్ జోర్దార్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

Exit mobile version