Mirai Movie Sensational Collections : మిరాయ్ సంచ‌ల‌నం కాసుల వ‌ర్షం

3 రోజుల్లోనే రూ. 81.2 కోట్ల గ్రాస్

Hello Telugu - Mirai Movie Sensational Collections

Hello Telugu - Mirai Movie Sensational Collections

Mirai : టీజీ విశ్వ ప్ర‌సాద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం మిరాయ్ (Mirai). ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కాసుల పంట పండిస్తోంది. కేవ‌లం మూడు రోజుల్లోనే రూ. 81.2 కోట్ల‌ను దాటేసింది. ఇది సినీ ఇండ‌స్ట్రీని విస్తు పోయేలా చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా దుమ్ము రేపుతోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా తేజ స‌జ్జా, రితికా నాయ‌క్, మంచు మ‌నోజ్, జ‌గ‌ప‌తిబాబు, శ్రియ శ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌త్యేకించి ఈ సినిమాకు ఉప‌యోగించిన గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండ‌డంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డుతున్నారు చూసేందుకు. వారంతంలో అంచ‌నాల‌కు మించి కాసులు వ‌స్తున్నాయి.

Mirai Movie Collections

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ అడ్వెంచర్ ఫాంటసీ అద్భుతమైన విజువల్స్, యాక్షన్ , సూపర్ హీరో థ్రిల్స్‌ను మిళితం చేస్తూ ప్రేక్షకులను ఆకర్షించింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఈ చిత్రం అడుగుజాడలను వాణిజ్య వర్గాలు అద్భుతంగా అభివర్ణించాయి. యునైటెడ్ స్టేట్స్‌లో మిరాయ్ 1.7 మిలియన్లకు పైగా వసూలు చేసింది, ఇప్పుడు 2 మిలియన్ల మైలురాయి వైపు దూసుకు పోతోంది. హనుమాన్ భారీ విజయం తర్వాత ఈ విజయం మ‌రింత ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఫాంటసీ శైలిలో తెలుగు సినిమా వర్ధమాన సూపర్ స్టార్‌గా తేజ సజ్జా ఆవిర్బవించాడు.

ఇదిలా ఉండ‌గా రాబోయే రోజుల్లో మిరాయ్ మూవీ రూ. 150 కోట్ల‌కు పైగా వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది సినీ వ‌ర్గాలలో.

Also Read : Murugadoss Interesting Update : అక్టోబ‌ర్ 3న ప్రైమ్ వీడియోలో మ‌ద‌రాసి

Exit mobile version