Minister Veena George Shocking Comments : 2031 నాటికి సార్వ‌త్రిక ఆరోగ్య సంర‌క్ష‌ణ

కేర‌ళ స‌ర్కార్ ల‌క్ష్యంగా పెట్టుకుంది

Hello Telugu - Minister Veena George Shocking Comments

Hello Telugu - Minister Veena George Shocking Comments

Minister Veena George : కేర‌ళ : కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ (Minister Veena George) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేర‌ళ రాష్ట్రంలో వ‌చ్చే 2031 సంవ‌త్స‌రం నాటికి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను సాధించ‌డ‌మే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ట్రామా కేర్, అత్యవసర స‌ర్వీస్ వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఆరోగ్య సేవలను పొందడంలో సమానత్వం నిర్ధారిస్తామని వీణా జార్జ్ అన్నారు. మంగ‌ళ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. హెల్త్ సెమినార్‌లో కేరళ ఆరోగ్య రంగం విజన్ 2031 అనే విధాన పత్రం త‌యారు చేసిన‌ట్లు చెప్పారు.

Minister Veena George Shocking Comments

వివిధ ఆరోగ్య పథకాలను ఏకీకృతం చేయడం ద్వారా కారుణ్య ఆరోగ్య సురక్ష పద్ద‌తిని ప్రారంభించిన‌ట్లు తెలిపారు. దీని ద్వారా, 42.2 లక్షల కుటుంబాలకు ఆరోగ్య కవరేజ్ అందించడం జ‌రిగిందన్నారు. అంతే కాకుండా కారుణ్య బెనెవోలెంట్ ఫండ్ పథకం కూడా అమలులో ఉందన్నారు మంత్రి వీణా జార్జ్. ఈ ప‌థ‌కం కింద ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య చికిత్స లభిస్తుందన్నారు. ఆరోగ్య సంరక్షణ రక్షణ నుండి ఎక్కువ మంది ప్రయోజనం పొందేలా ప్రభుత్వం ఇప్పుడు కవరేజీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి చెప్పారు. క్యాన్సర్‌ను నివారించడానికి, ఆరోగ్యం ఆనందం, క్యాన్సర్‌ను తరిమి కొట్టండి అనే పేరుతో సామూహిక ప్ర‌చారం చేప‌ట్టామ‌న్నారు.

రుగుతున్న జీవనశైలి వ్యాధులు, అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వంటి అరుదైన ఇన్ఫెక్షన్‌లతో సహా ఆరోగ్య రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా ఒక అంటువ్యాధి నిఘా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని వీణా జార్జ్ అన్నారు.

Also Read : Pawan Kalyan – AP Growth : గ్రామీణ ముఖచిత్రం మారేలా పల్లె పండగ 2.0

Exit mobile version