Minister Vasamshetty Fired on YSRCP : వైసీపీ ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేదు : వాసం శెట్టి

కార్మిక శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Minister Vasamshetty Fired on YSRCP

Hello Telugu - Minister Vasamshetty Fired on YSRCP

Minister Vasamshetty : అమ‌రావ‌తి : మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamshetty) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీసీ కమ్యూనిటీ కులాల్లో అసత్య ప్రచారం జరుగుతోంద‌ని ఆవేద‌న చెందారు. కోనసీమ వైసిపి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గతంలో శెట్టిబలిజి కమ్యూనిటీ ని మార్చేస్తున్నాం అని అవగాహన లేకుండా మాట్లాడటం దారుణ‌మ‌న్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే చేశా అని చెప్పి జగ్గిరెడ్డి స్పష్టత లేకుండా కామెంట్స్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు మంత్రి.

Minister Vasamshetty Subhash Slams YSRCP Allegationa

గతంలో శెట్టిబలిజ లో గౌడ అని వస్తుంది అనేది చాలా మందికి అనుమానాలు ఉండేవన్నారు. దానిపై గతంలో ఫిర్యాదులు అందాయని చెప్పారు. రాష్ట్రం విడి పోయినప్పుడు శెట్టిబలిజలను ఓసీ లో కలపడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం ఇబ్బంది కలిగిందన్నారు వాసంశెట్టి సుభాష్..అది త్వరలోనే రిక్టిఫైవ్ అవుతుందని స్ప‌ష్టం చేశారు. శెట్టి బలిజలను కాపులలో కలిపేశారని వైసిపి వారు అసత్య ప్రచారాలు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గతంలో పాస్ పాసు పుస్తకాల నుండి, సర్వే రాళ్ళ వరకు జగన్ ఫోటో లే ఉండేవంటూ ఎద్దేవా చేశారు. అవి మానుకుంటే మంచిదని అది 11 కాస్తా వ‌చ్చేసారి ఎన్నిక‌ల్లో ఒకే ఒక్క స్థానానికి ప‌డి పోతుంద‌న్నారు.

గతంలో ఒక బీసీ కార్పొరేషన్ కూడా లేద‌న్నారు. బీసీలు రక్షణ చట్టం కూడా కూటమి త్వరలో తీసుకు వస్తుందన్నారు వాసం శెట్టి సుభాష్. బిసి కులాలకు 10 శాతం లిక్కర్, బార్ లైసెన్స్ కూడా ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. రాష్ట్రంలో యూరియా షార్టేజ్ వస్తుంది అని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఎకరాకు 2 బస్తాలు సరిపోతాయి ..నీరు ఎక్కువ అయితే 3 బస్తాలు మాత్ర‌మే అవ‌స‌రం ఉంటుంద‌న్నారు. గతంలో వైసిపి సంవత్సరానికి 5 లక్షల మెట్రోల్ టన్నులు ఇస్తే , తాము వ‌చ్చాక ఇప్ప‌టి వ‌ర‌కు 7 ల‌క్ష‌ల‌కు పైగా మెట్రిక్ ట‌న్నుల యూరియా స‌ర‌ఫరా చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Sanju Samson Sensational : సంజూ శాంస‌న్ వ‌ర్సెస్ శుభ్ మ‌న్ గిల్

Exit mobile version