Minister Vasamsetti Interesting : భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు నైపుణ్య శిక్ష‌ణ

ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

Hello Telugu - Minister Vasamsetti Interesting

Hello Telugu - Minister Vasamsetti Interesting

Minister Vasamsetti : విజ‌య‌వాడ – భ‌వ‌న నిర్మాణ కార్మికుల కోసం ప్ర‌త్యేకంగా నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti). కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి భవన నిర్మాణ కార్మికుల బోర్డ్ చైర్మన్ బాబ్జి ఆధ్వర్యంలో 25 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు మంత్రి. బోర్డ్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామ‌ని చెప్పారు. రెండేళ్ల‌ తర్వాత మొదటిసారి 25వ భవన నిర్మాణ శాఖ బోర్డ్ సమావేశం నిర్వహించడం జ‌రిగింద‌న్నారు. గత 5 ఏళ్లలో డూబ్లికేషన్ పేరుతో పథకాలు నిలిపేశారని ఆవేద‌న వ్యక్తం చేశారు. దీనికి కార‌ణం గ‌తంలో ఏలిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అంటూ మండిప‌డ్డారు వాసంశెట్టి సుభాష్.

Minister Vasamsetti Subhash Key Comments

విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లో భవన నిర్మాణ కార్మికుల కోసం నూతన భవనాలు కట్టాలని నిర్ణయించామ‌న్నారు. అలాగే జిల్లాకు ఒక ఏసీఎల్ కట్టాలని, కలెక్షన్ గురించి కూడా చర్చించామని తెలిపారు. నరేగా వర్కర్స్ ను భవన నిర్మాణ కార్మికులలో కలిపే విషయం ను ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ దృష్టికి తీసుకు వెళ‌తామ‌న్నారు. అలా చేస్తే మరో 15 లక్షల మంది కార్మికులు ఈ శాఖ లో కలుస్తార‌ని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల కోసం స్కిల్ డెవలెప్మెంట్ కార్యక్రమాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. భవన నిర్మాణ రంగంలో జరుగుతున్న ప్రమాదలపై కూడా సేఫ్టీ ఆఫీసర్లు ను నియమించడానికి కొన్ని యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నామ‌న్నారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Also Read : Eagle Team Ganja Seize Sensational : రూ. 4.2 కోట్ల విలువైన 847 కిలోల గంజాయి ప‌ట్టివేత

Exit mobile version