Vangalapudi Anitha : అమరావతి : అన్నదాతల సంక్షేమానికి తమ కూటమి సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha). ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం రైతు వారోత్సవాలులో భాగంగా పెద పాయకరావుపేట మండలం రామభద్రపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు.పెద రామ భద్రపురం గ్రామంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో వివిధ అంశాలపై చర్చించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా డ్రోన్ తో సేంద్రీయ ఎరువులు పిచకారి చేశారు. స్వయంగా పొలంలోకి దిగి స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేశారు వంగలపూడి అనిత. వరి పొలంలో వరి కంకులను పరిశీలించారు.
Home Minister Vangalapudi Anitha Comments
రైతు వారోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ల ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు.
అన్నదాత-సుఖీభవ-పియం కిషాన్ పథకంలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గ రైతులకు ఇరవై ఐదు కోట్ల,అరవై లక్షల రూపాయల చెక్కును రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వంగలపూడి అనిత ప్రసంగించారు. రైతు దేశానికి వెన్నుముక అని, రైతు ఎప్పుడు రారాజేనని స్పష్టం చేశారు. రైతులు వినూత్నమైన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఎరువులు అడగని గ్రామం పెద రామభధ్రాపురం అని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నామని రైతులు గర్వంగా చెబుతున్నారని తనకు ఆనదంగా ఉందన్నారు.
Also Read : Venkaiah Naidu Important Comments : శ్రీ సత్యసాయిబాబా ప్రేమ స్వరూపుడు


















