Minister Uttam Kumar : నల్లగొండ జిల్లా : రాష్ట్ర భారీ, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar) కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్లుగా మారుస్తామని వెల్లడించారు. తమ సర్కార్ వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ. 74 కోట్లతో అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయకుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు మంత్రులకు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. రహదారుల అభివృద్దిపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు.
Minister Uttam Kumar Reddy Comments
ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ప్రజా పాలనలో అనేక పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందన్నారు . దేశంలో ఎక్కడా లేని విధంగా తాము అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో కేఎన్ఎం డిగ్రీ కాలేజీని ప్రభుత్వ పరం చేశారని, ఈ నిర్ణయం తీసుకున్నది తమ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 15 ఏళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ది విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ది, సంక్షేమం కోసం ఎడతెగని కృషి చేస్తున్నామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read : Telangana Cabinet Approved : స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్


















