అమరావతి : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం అమలు తీరు పట్ల ఆరా తీశారు. ఎంత వరకు పనులు పూర్తయ్యాయని ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా వారి సమాధానం ఆశించిన మేర లేకపోవడంతో మండిపడ్డారు. ఏం చేస్తున్నారంటూ నిలదీశారు.మార్టేరు ఎస్సీ కాలనీలో సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ల అమలుపై అధికారులను ప్రశ్నించారు. పీఎం సూర్యఘర్ పనులపై మంత్రికి తప్పుడు సమాచారం ఇవ్వడం పై ఫైర్ అయ్యారు గొట్టి పాటి రవికుమార్. బాధ్యత కలిగిన స్తానాలలో ఉన్నవారు ఇలా మిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా అని భగ్గుమన్నారు.
నర్సాపురం డీఈ, ఆచంట ఏడీ లకు చార్జీ మెమోలు ఇవ్వాలని ఎస్ఈని ఆదేశించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు. కఠిన చర్యలు తప్పవన్నారు. ప.గో జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు.పీఎం సూర్యఘర్ పనులు నత్తనడకన సాగుతుండడం పై అసహనం వ్యక్తం చేశారు . సోలార్ రూఫ్ టాప్ నిర్మాణ పనుల్లో జాప్యం పనికిరాదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా అయితే ఎలా అని మందలించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.
పీఎం సూర్యఘర్ టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులతో మాట్లాడారు మంత్రి. నిబంధనలకు అనుగుణంగా సూర్యఘర్ కనెక్షన్లు ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు. కనీసం రోజుకు 400 పైగా కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. గుత్తేదారులు అదనపు సిబ్బందితో పని చేయించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. సూర్యఘర్ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పక పాటించాలని అన్నారు.

















