Minister Sridhar Babu Interesting Comments : ప్రేమ‌కు ప్ర‌తిరూపం తెలంగాణ రాష్ట్రం

అన్ని వ‌ర్గాల‌ను అక్కున చేర్చుకునే న‌గ‌రం

Hello Telugu - Minister Sridhar Babu Interesting Comments

Hello Telugu - Minister Sridhar Babu Interesting Comments

Minister Sridhar Babu : హైద‌రాబాద్ : ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, లైఫ్ సైన్సెస్, బయో ఇన్నోవేషన్, రూరల్ గ్రోత్ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సమగ్ర రోడ్ మ్యాప్ ను రూపొందిస్తామన్నారు. రాజ్ భవన్ లో నిర్వహించిన “తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్(ఫేజ్ -2)” ప్రారంభోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

Minister Sridhar Babu Comments

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాంతం, రాష్ట్రంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే గొప్ప మనస్సు తెలంగాణ ప్రజలది అని వివరించారు. కనెక్టివిటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి సవాళ్లను సైతం అధిగమించి డిజిటల్ అక్షరాస్యత, ఐటీ స్కిల్లింగ్, ఫిన్ టెక్, డిజిటల్ సర్వీస్ లను ఈశాన్య రాష్ట్రాలు అందిపుచ్చు కుంటున్నాయన్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా పని చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా రేపటి తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.

తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ ఛేంజ్, ఏఐ ఇంటిగ్రేటెడ్ అకడమిక్ కరిక్యులం,. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చుతాయని మంత్రి అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు టీ హబ్ తరహాలోనే “వన్ బయో” పేరిట ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.

Also Read : Bode Ramachandra Yadav Fired on CBN : చంద్రబాబూ కేరళ సీఎంను చూసి నేర్చుకో

Exit mobile version