Bode Ramachandra Yadav Fired on CBN : చంద్రబాబూ కేరళ సీఎంను చూసి నేర్చుకో

బీసీవై పార్టీ చీఫ్ రామ‌చంద్ర యాద‌వ్ ఫైర్

Hello Telugu - Bode Ramachandra Yadav Fired on CBN

Hello Telugu - Bode Ramachandra Yadav Fired on CBN

Bode Ramachandra Yadav : చిత్తూరు జిల్లా : శబరిమలలో అయ్యప్ప భక్తులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యాత్రికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ (Bode Ramachandra Yadav) రాసిన లేఖపై కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందించింది. భక్తుల ఇబ్బందులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత దేవాదాయ శాఖ మంత్రిని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం అధికారికంగా తెలియ జేసింది. శబరిమలలో కనీస సౌకర్యాలు లేక తెలుగు భక్తులు పడుతున్న అవస్థలను వివరిస్తూ బోడె రామచంద్ర యాదవ్ కేరళ ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం పంపిన విషయం తెలిసిందే. ఈ లేఖకు కేరళ సీఎం కార్యాలయం నుంచి తక్షణమే స్పందన లభించింది. బీసీవై పార్టీ అధ్యక్షుడికి పంపిన అధికారిక ఈ-మెయిల్‌లో మీ అభ్యర్థనను స్వీకరించామని. తగిన చర్యలు తీసుకోవడం కోసం దీనిని దేవాదాయ శాఖ మంత్రికి పంపించడం జరిగింది” అని కేరళ సీఎం కార్యాలయ అండర్ సెక్రటరీ పేర్కొన్నారు.

Bode Ramachandra Yadav Slams CM Chandrababu

ప్రజల సమస్యలపై ఒక ముఖ్యమంత్రి ఎలా స్పందించాలో, ఎంత వేగంగా స్పందించాలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ బోడె రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో హితవు పలికారు. శబరిమల భక్తుల సమస్యలపై తాను రాసిన ఒకే ఒక్క లేఖకు కేరళ సీఎం కార్యాలయం గంటల వ్యవధిలో స్పందించి చర్యలకు ఆదేశించిందని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తాను 8 సార్లు లేఖలు రాసినా, చంద్రబాబు నుంచి కనీసం ఒక అక్షరం కూడా సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు.

Also Read : CJI Suryakant Growth : సీజేఐగా కొలువు తీరిన జ‌స్టిస్ సూర్యకాంత్

Exit mobile version