Minister Savitha : విజయవాడ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అధికార దర్పం కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు అలవాటుగా మారింది. రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయస్థితిలో పడివున్న వృద్ధుని లేపి, సపర్యలు చేశారు. తన కాన్వాయ్ లోని వాహనంలోకి ఎక్కించి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు, పాదాచారులు మంత్రి సవిత మానవత్వాన్ని కొనియాడారు. ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. ఆ సమయంలో విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి మంత్రి సవిత బయలుదేరారు. క్యాంపు కార్యాలయం సమీపంలోకి రాగానే విజయవాడ-గుంటూరు హైవేపై వడ్డేశ్వరం వైపు ద్విచక్ర వాహనంపై వృద్ధుడు వెలుతున్నాడు.
Minister Savitha Humanity
తీవ్ర అనారోగ్యంతో వృద్ధుడు వెలుతున్న వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెలుతున్న మంత్రి సవిత తనను చూశారు. వెంటననే తన కాన్వాయ్ ను ఆపి, వృద్ధుడికి నీరు తాగించి సపర్యలు చేశారు. 108 వాహనం వచ్చే వరకూ ఆగకుండా, కొద్దిగా తేరుకున్న వృద్ధుడిని తన ఎస్కార్ట్ వాహనంలో సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసు కోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. ఎటువంటి అధికార దర్పం చూపకుండా మంత్రి సవిత స్పందించిన తీరు చూసి సవితను ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. గతంలోనూ ఇదే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ మంత్రి సవిత స్పందించిన తీరును గుర్తు చేశారు.
Also Read : Stock Market Growth : సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగసింది – నిఫ్టీ 25,250 దాటింది
















