Minister Savitha : కడప జిల్లా – పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) స్పష్టం చేశారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో గురువారం నియోజక వర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి ఇన్చార్జి మంత్రి సవిత పాల్గొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
Minister Savitha Comments
రోడ్డు ప్రమాదంలో జెడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్య మైందన్నారు. ఉప ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశౄరు మంత్రి సవిత. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నడుచుకుంటామని వెల్లడించారు. ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణిని కానీ, ఆయన తమ్ముడిని గాని బరిలో నిలపాలని నియోజ వర్గ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారన్నారు.
ఇదే విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళతామని, సీఎం చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం మేరకు పోటీపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. శుక్రవారమే నామినేషన్లకు చివరి రోజని, నేటి సాయంత్రంలోగా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇన్చార్జి మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ కీలక నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు పులివెందులకు చేరుకున్న ఇన్చార్జి మంత్రి సవితకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు.
Also Read : US Navy Flight Crash Sensational : కాలిఫోర్నియాలో కూలిన అమెరికా ఫైటర్ జెట్ ఎఫ్-35


















