త‌ప్పులు చేయ‌కుండా జ‌గ‌న్ కు భ‌యం ఎందుకు..?

నిప్పులు చెరిగిన రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్. స‌విత‌

hellotelugu-MinisterSavitha

అమరావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌.
అయిదేళ్ల అసమర్థ పాలనలో తప్పులు మీద తప్పులు చేశారని, వాటిని సరిదిద్దుకోవాలని ఆనాడే బాధ్యత గల ప్రతిపక్షంగా హెచ్చరించాం అన్నారు. కాని, మా మాటలను పట్టించు కోలేద‌న్నారు. ఆనాడు మీరు చేసిన తప్పులకే నేడు కేసుల రూపంలో ఫలితం అనుభవిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇందులో తమ ప్రమేయమేమీ లేదన్నారు ఎస్. స‌విత‌. జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందిని, మరికొందరు గజదొంగలు బయటకు రాబోతున్నారని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తప్పు చేయకుంటే జగన్ కు గాని, ఆయన బ్యాచ్ గాని భయమెందుకు అని ప్రశ్నించారు. విజయవాడ నగరం గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించాలని పనిచేయడం కక్ష సాధింపా..? అని ప్రశ్నించారు. కల్తీ మద్యం కేసులో ఇరుక్కుపోయిన వైసీపీ నాయకుడు జోగి రమేశ్..బీసీ కార్డు ఉపయోగించడం చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు. కులం పేరుతో చేసిన తప్పుల నుంచి తప్పించు కోవడం కుదరదన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి, భూదేవి లాంటి భువనమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారన్నారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించి ప్రాణం కోల్పోయేలా చేశారన్నారు. ఎందరో ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అక్రమంగా వేధించి, జైల్లో పెట్టారన్నారు మంత్రి ఎస్ .స‌విత‌.

Exit mobile version