Minister Savitha : విశాఖపట్నం : విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ప్రధానంగా టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు, మంత్రి సవిత (Minister Savitha) సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్‌టైల్స్, రీసైక్లింగ్, గార్మెంట్స్, సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి ఇన్విస్టర్స్ ఆసక్తి చూపారు. విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో కృష్ణీ జిల్లా మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
Minister Savitha Comments
చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ ఏర్పాటుతో రెండు వేల ఉద్యోగాలు రానున్నాయి. గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థతో గుంటూరులో రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900ల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.
Also Read : DY CM Pawan Kalyan Shocking Comments : గో మాంసం అక్రమ రవాణా ముఠాను వదలొద్దు


















