Minister Savitha : అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత (Minister Savitha). ఇందుకు ఉదాహరణ ఇటీవల విశాఖలో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, భౌగోళిక పరిస్థితులు, సమర్థ నాయకత్వంతో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయని చెప్పారు. ఈ సదస్సులో రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారని అన్నారు. వాటిలో రూ.4,381.38 కోట్లు ఏపీ టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని పేర్కొన్నారు ఎస్. సవిత. రాష్ట్ర ప్రభుత్వంతో ఎనిమిది మంది ఇన్వెస్టర్లు ఎంవోయూలు కుదుర్చకున్నారని వెల్లడించారు. ఈ ఒప్పందాలతో టెక్స్ రంగంలో కొత్తగా 6,460 ఉద్యోగాలు ప్రత్యక్షంగా రానున్నాయని చెప్పారు.
Minister Savitha Key Comments on Texttiles Development
గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన టెక్స్ టైల్స్ రంగానికి ఈ పెట్టుబడులు పునరుత్తేజం కలిగించేవేనని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, సవిత కృషితో టెక్స్ టైల్స్ రంగంలో పూర్వ వైభవం నెలకొందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోందన్నారు ఎస్. సవిత. 2024-29 నూతన టెక్స్ టైల్స్ పాలసీ టార్గెట్ లో 43 శాతం పెట్టుబడులు విశాఖ సమ్మిట్ లోనే రావడం విశేషం అన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో పరిశ్రమలు చాలా కీలకం. కాని, గత జగన్ ప్రభుత్వ హయాంలో సరిదిద్దుకోలేని తప్పిదాలు ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటు పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-24 మధ్య సరైన ప్రోత్సాహకాలు, అప్పటి ప్రభుత్వ విధానాల కారణంగా ఉన్న పరిశ్రమలు తరలిపోగా, కొత్త పరిశ్రమల ఏర్పాటు ఊసే లేదన్నారు. ముఖ్యంగా టెక్స్ టైల్స్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు మంత్రి ఎస్. సవిత.
Also Read : NIA Shocking Anmol Bishnoi : గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్

















