Minister Savitha : పులివెందుల/కడప : ప్రధాని నరేంద్రమోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) స్పష్టం చేశారు. రాయలసీమలో హార్టీకల్చర్ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని, పులివెందులకు నీరిచ్చింది కూడా తామేనని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని, దీన్ని తట్టుకోలేక వైసీపీ విషం కక్కుతోందని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడానికి సిద్ధమని మంత్రి సవిత సవాల్ విసిరారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు.
Minister Savitha Comments
దీపం -2, తల్లికి వందనం, ఒకటో తారీఖునే పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు ఎస్. సవిత. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు.. 15 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. నూతన రేషన్ కార్డులు అందజేశామని, స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదలకు ఎంతో మేలు కలుగుతోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. త్వరలో పేదలకు ఇళ్లు పంపిణీ చేయనున్నామన్నారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి, ఆయన పరివారం తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Also Read : Rahul Ramakrishna Strong Response : నేను కేవలం చిన్నపాటి నటుడిని మాత్రమే
