జ‌గ‌న్ రెడ్డీ నీ ఆటలు ఇక సాగ‌వు : స‌త్య‌కుమార్

పీపీపీ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం

hellotelugu-SatyakumarYaadav

విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అత్యంత సౌమ్యంగా ఉండే ఆయ‌న ఉన్న‌ట్టుండి మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడ‌టం అల‌వాటై పోయింద‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చాల‌క పైగా అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేయ‌డం, విమ‌ర్శించ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. తాను రాష్ట్రంలో మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తాన‌ని క‌ల‌లు కంటున్నాడ‌ని, అది ఇప్ప‌ట్లో జ‌రిగే ప‌ని కాద‌న్నారు. ఎందుకంటే జ‌నం త‌న‌ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. కేవ‌లం త‌న ఆస్తుల‌ను కాపాడు కోవ‌డానికి మాత్ర‌మే ఐదేళ్ల‌పాటు అధికారాన్ని ఉప‌యోగించు కున్నార‌ని ఆరోపించారు స‌త్య కుమార్ యాద‌వ్.

ఇక కోటి సంత‌కాల గురించి కూడా ప్ర‌స్తావించారు మంత్రి. ఆ సంతకాలు వైసీపీ వాళ్లే పెట్టారేమోనంటూ అనుమానం వ్య‌క్తం చేశారు. విచిత్రం ఏమిటంటే ఒక బాధ్య‌త క‌లిగిన మాజీ సీఎం బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. అవగాహన లేని వ్యక్తి యోగా గురించి మాట్లాడటం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు స‌త్య కుమార్ యాద‌వ్ . ఇక నుంచి నీ ఆట‌లు, కుట్ర‌లు సాగ‌వంటూ వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపులు, దౌర్జన్యాల వల్లే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని అయినా ఇంకా సోయి లేకుండా జ‌గ‌న్ రెడ్డి మాట్లాడటం దారుణ‌మ‌న్నారు. పీపీపీ అనేది తాము తీసుకున్న నిర్ణ‌యం కాద‌న్నారు. దానిని కేంద్ర స‌ర్కార్ తీసుకు వ‌చ్చింద‌ని, అది పూర్తిగా విధాన ప‌ర‌మైన నిర్ణ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Exit mobile version