Minister Satya Prasad : అమరావతి – బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏపీలోని ప్రాజెక్టులన్నీ కళ కళ లాడుతున్నాయి. నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ సందర్బంగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష చేపట్టారు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Satya Prasad). ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రేపల్లె , వేమూరు నియోజకవర్గ కరకట్టకు అనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.
Minister Satya Prasad Key Comments
కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవిన్యూ అధికారులకు, పోలీసులకు సూచించారు మంత్రి. రెవెన్యూ అధికారులకు సెలవులు రద్దు చేయడం జరిగిందన్నారు. కరకట్ట ప్రాంతంలో గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ తీరం దాటుతున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు. కృష్ణానది పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నదిని గాని, కాలువలు గాని దాటే ప్రయత్నం చేయవద్దంటూ సూచించారు అనగాని సత్య ప్రసాద్. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కునేందుకు రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Also Read : CM Chandrababu – Free Bus : ఉచిత బస్సు పథకం ఆదరణ అద్భుతం – సీఎం















