విజయవాడ : అణగారిన వర్గాల ఆశా జ్యోతి సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత చెప్పారు. ఆమె ఆశయాల సాధనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. సావిత్రిబాయి ఫూలే గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి అని కొనియాడారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన ధీశాలి అని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, స్త్రీ విద్య కోసం కృషి చేసిన మొట్టమొదటి మహిళా ఉద్యమకారిణి అని అన్నారు. తన భర్త మహత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం గొప్ప పోరాటం చేశారన్నారు.
వితంతు వివాహాలను ప్రోత్సహించారని, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు. సావిత్రిభాయిపూలే ఆశయ సాధనే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశారన్నారు. మహిళలకు ఉన్నత విద్యే లక్ష్యంగా మహిళా యూనివర్శిటీని నెలకొల్పారన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు రాజకీయ, ఆర్థిక భరోసా కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు సవిత. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు మంత్రి ఎస్. సవిత. అంతే కాకుండా రైతులను , వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చసిందని మండిపడ్డారు. కానీ తాము పవర్ లోకి వచ్చాక పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన సాగిస్తున్నామని చెప్పారు.
