అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికే పరిమితం చేసిందన్నారు. దీనివల్ల బీసీలు ఎన్నో పదవులు కోల్పోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనిలో భాగంగా దీనిలో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించిందని చెప్పారు ఎస్. సవిత.
ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నామన్నారు. నా బీసీలు అంటూ వెనుకబడిన కులాలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందన్నారు. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కోత విధించి, సమాజంలో సగభాగమైన వెనుకబడి వర్గాల వారిని రాజ్యాధికారానికి దూరం చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆది నుంచి బీసీల పక్షపాతి అని తెలిపారు. బీసీలకు జరిగిన ద్రోహాన్ని గుర్తించి, అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు అందజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ ను నియమించారన్నారు.
