Minister Ramanaidu : విజయవాడ – కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర జలహారతి నిర్వహించారు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Ramanaidu). విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆనాడు పట్టి సీమను జగన్ మోహన్ రెడ్డి వట్టి సీమ అంటూ ఎద్దేవా చేశాడని, ఇప్పుడు తను అడ్రస్ లేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనను , తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని, ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
Minister Ramanaidu Comments
రూ.1300 కోట్లతో పట్టిసీమ నిర్మిస్తే, 2014-19 లో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రూ. 50వేల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ ప్రభుత్వం కనీసం ప్రాజెక్టుల నిర్వహణకు, గేట్ల కు గ్రీజు పెట్టడానికి కూడా నిధులు ఇవ్వ లేదని ఆరోపించారు. శ్రీశైలం, ధవలేశ్వరం మరమత్తులు, నిర్వహణ కోసం రూ 350 కోట్లు నిధులు కేటాయించిన ఘనత తమ కూటమి సర్కార్ కే దక్కుతుందన్నారు. శ్రీశైలం గేట్ల ద్వారా వరద నీరు విడుదల చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు.
గతేడాది బుడమేరు వరదల వల్ల పడిన 3 గండ్లను కలుపుతూ సిసి వాల్ నిర్మించామన్నారు నిమ్మల రామా నాయుడు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే, జగన్ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. వెంటిలేటర్ మీద ఉన్న ఆర్ధిక వ్యవస్థ కు చంద్రబాబు , పవన్ కళ్యాణ్, మోదీ ల సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఊపిరి పోస్తున్నారని అన్నారు. జగన్ స్వంత తల్లిని, చెల్లిని ఏ విధంగా కించ పరిచాడో, వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి కూడా అలానే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నోరు పారేసుకున్నాడని అన్నారు.
Also Read : ఆసియా లోనే అతి వృద్ద ఏనుగు కన్నుమూత
