Minister Ponnam Prabhakar Proven : 17 వేల జాబ్స్ తో క్యాలెండ‌ర్ సిద్దం – పొన్నం

మార్చి లోపు ల‌క్ష ఉద్యోగాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యం

Hello Telugu - Minister Ponnam Prabhakar Proven

Hello Telugu - Minister Ponnam Prabhakar Proven

Ponnam Prabhakar : హైద‌రాబాద్ – జాబ్ క్యాలెండర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మార్చి లోపు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించామని వెల్లడించారు. 17 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సామాజిక వ‌ర్గానికి ప్ర‌యారిటీ ఇస్తుంద‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్.

Minister Ponnam Prabhakar Comments

గ‌త ఏడాది ఫిబ్రవరి 4 నుండి కుల గణన సర్వే చేస్తామని నిర్ణయం తీసుకున్న విషయం ఇప్ప‌టికే తెలిసింద‌న్నారు. ఈ ఏడాదిలో రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నామ‌న్నారు మంత్రి. చట్టం 3,4 లో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీ లకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేయడం జరిగిందన్నారు. దానిని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి కి పంపించామ‌న్నారు పొన్నం ప్ర‌భాక‌ర్. కోర్టు ఇచ్చిన తీర్పు లో భాగంగా నెల రోజుల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల జరుపాలని నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో 19 వ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. మిగ‌తా పార్టీలు కూడా రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మంత్రి కోరారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర సందర్భంగా సామాజిక న్యాయం చేయాలని జిత్నే అబాధి ఉత్నే ఇసేదారీ అని కుల గణన సర్వే చేసుకున్నామ‌న్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్ గా ఎంపెరికల్ డేటా సేకరించిందన్నారు.

Also Read : Telangana Cabinet Approved : బీసీ రిజర్వేషన్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Exit mobile version