Minister Ponguleti Interesting Update : మేడారం జాత‌రకు విస్తృత ఏర్పాట్లు : పొంగులేటి

యుద్ద‌ ప్రాతిప‌దిక‌న అభివృద్ది ప‌నులు

Hello Telugu - Minister Ponguleti Interesting Update

Hello Telugu - Minister Ponguleti Interesting Update

Minister Ponguleti : వ‌రంగ‌ల్ జిల్లా : ప్ర‌పంచంలోనే అతి పెద్ద జాత‌ర‌గా పేరు పొందిన మేడారం జాత‌రకు సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి (Minister Ponguleti). ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ జాత‌ర‌ అభివృద్ది ప‌నులు యుద్ద ప్రాతిప‌దిక‌న జరుగుతున్నాయని చెప్పారు. భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని గిరిజ‌న సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా ప్ర‌తి నిర్మాణం, ప్ర‌తి క‌ట్ట‌డాన్ని పూర్తిగా జాత‌ర పూజారులు, ఆదివాసీ పెద్ద‌ల‌ సూచ‌నలతో మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు మంత్రి.

Minister Ponguleti Srinivas Reddy Key Comments on Medaram Jataram

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో స‌హ‌చ‌ర మంత్రులు ద‌న‌స‌రి అన‌సూయ ( సీత‌క్క‌), కొండా సురేఖ‌ గారు, ఎంపీ బలరాం నాయక్ తో కలిసి అమ్మ వార్లను దర్శించుకుని, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్మాణ ప‌నుల‌ను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఆదివాసీ సంప్ర‌దాయాల‌కు పెద్దపీట వేస్తూ ఇల వేల్పులైన సమ్మక్క‌, సారలమ్మ‌, ప‌గిడిద్ద రాజు, గోవింద రాజుల గ‌ద్దెల ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు ప్రజా ప్రభుత్వం శ్రీ‌కారం చుట్టిందని చెప్పారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

కోట్లాది మంది భ‌క్తి విశ్వాసాల‌తో ముడిప‌డి ఉన్న ఈ జాత‌ర‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముంద‌స్తుగా మొక్కులు చెల్లించుకునే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా మేడారానికి వ‌చ్చే ప్ర‌ధాన ర‌హ‌దారిలో మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారులను ఆదేశించారు. భ‌క్తుల సంఖ్య‌ను దృష్టిలో పెట్టుకొని గ‌ద్దెల వ‌ద్ద కెపాసిటీ 3 వేల నుంచి 10 వేల‌ వరకు పెంచుతున్నామ‌ని అన్నారు. జాత‌ర ప్రాశ‌స్త్యానికి త‌గ్గ‌ట్లు భారీ ఎత్తున స్వాగ‌త తోర‌ణాల నిర్మాణంతో పాటు గ‌ద్దెల వ‌ద్ద‌కు భ‌క్తులు సులువుగా చేరుకోవడం, గ‌ద్దెల ద‌ర్శ‌నం, బంగారం (బెల్లం) స‌మ‌ర్ప‌ణ‌, జంప‌న్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

Also Read : Nandakumar Reddy Fired on Harish Rao : అవినీతి ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : వైస్ ఛాన్స‌ల‌ర్

Exit mobile version