Minister Parthasarathy-Super Six Success : అనంత‌పురంలో స‌భ సూప‌ర్ స‌క్సెస్ : పార్థ‌సార‌థి

ఏపీ రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కీల‌క కామెంట్స్

Hello Telugu - Minister Parthasarathy-Super Six Success

Hello Telugu - Minister Parthasarathy-Super Six Success

Minister Parthasarathy : అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ఆధ్వ‌ర్యంలో అనంత‌పురం జిల్లా వేదిక‌గా నిర్వ‌హించిన సూప‌ర్ సిక్స్ బంప‌ర్ హిట్ స‌భ భారీ స‌క్సెస్ అయ్యింద‌ని అన్నారు ఏపీ రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి (Minister Parthasarathy). గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అయితే వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నాడ‌ని మండిప‌డ్డారు. ఆధారాలు లేకుండా ఎలా విమ‌ర్శ‌లు చేస్తారంటూ ప్ర‌శ్నించారు మంత్రి. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాజ‌కీయాల‌లో ఆరోప‌ణ‌లు చేసినా దానికి గౌర‌వం ఉండాల‌న్నారు.

Minister Parthasarathy Key Comments

జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న ప‌రివారం కనీసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండేద‌న్నారు. దమ్ముంటే పెన్షన్లపై జగన్‌ చర్చకు రావాల‌ని స‌వాల్ విసిరారు.
పెన్షన్లపై కావాలనే YCP బురద జల్లుతోందన్నారు పార్థ‌సార‌థి. మెడికల్ కాలేజీలపై వైసీపీది దుష్ప్రచారం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. వైసీపీ హయాంలో 17 కాలేజీలు ప్రారంభించి ఐదు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయ లేద‌న్నారు. 10 శాతం నిధులు పెట్టి తామే చేసినట్టు చెప్పారని మండిప‌డ్డారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు కొలుసు పార్థ‌సార‌థి.

అనంత‌పురం జిల్లా కేంద్రంగా నిర్వ‌హించ‌ని స‌భ‌కు ఊహించ‌ని విధంగా 4 ల‌క్ష‌ల మందికి పైగా జ‌నం హాజ‌ర‌య్యార‌ని, ఇది త‌మ ప్ర‌భుత్వ ప‌నితీరుకు నిద‌ర్శన‌మ‌న్నారు. దీనిని జీర్ణించుకోలేక పోతున్నార‌ని మండిప‌డ్డారు.

Also Read : Hero Dulquer Salmaan-Pooja Hegde : దుల్క‌ర్ స‌ల్మాన్ తో జ‌త‌క‌ట్టిన ముద్దుగుమ్మ‌

Exit mobile version