రూ. 456 కోట్లతో వెలిగొండ ఫీడ‌ర్ కెనాల్

సీఎం చంద్ర‌బాబు ప్రారంభిస్తార‌న్న మంత్రి

hellotelugu-NimmalaRamanaidu

అమ‌రావ‌తి : ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష చేప‌ట్టారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్షంతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. జనవరి మొదటి వారంలో సిఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారని వెల్ల‌డించారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు.
రూ. 456 కోట్లతో వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులు ముఖ్య‌మంత్రి ప్రారంభిస్తార‌ని ప్ర‌క‌టించారు. నాడు పోలవరంను డ‌యా వాల్ ను ధ్వంశం చేసిన వైసిపి, నేడు వాళ్ళ కరపత్రిక లో మాట్లాడటం, దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు . మాజీ జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

నాడు కేంద్రం రీయంబర్స్ చేసిన 3800 కోట్లను సైతం డైవర్ట్ చేసి, జగన్ పోలవరం ను ముంచేశాడ‌ని ఆర‌పించారు నిమ్మ‌ల రామా నాయుడు. తాము వ‌చ్చాక కొత్త డయాఫ్రం వాల్ 1034 మీటర్లు నిర్మాణం జరిగి, 83 శాతం పూర్తైంద‌ని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు నేటికి 87 శాతం పూర్తి చేశాం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఒక్క ఏడాదిలోనే నిర్వాసితుల కోసం 1894 కోట్లు విడుదల చేశామ‌న్నారు నిమ్మ‌ల రామానాయుడు. చంద్రబాబు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పనులు చేస్తూ, 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామ‌న్నారు.

Exit mobile version