Nara Lokesh : అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యా రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాము వచ్చాక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా మెరుగైన, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని కంకణం కట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రత్యేకమైన పాలసీని తీసుకు వచ్చామన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, అధ్యాపకులు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని చెప్పారు.
Minister Nara Lokesh New Innovation
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు నారా లోకేష్. ఇందుకు సంబంధించి వెంటనే విధి విధానాలు రూపొందించాలని ఆదేశంచారు. స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆసక్తిగల విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం కింద సాయం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో చదువు కుంటున్నారని చెప్పారు నారా లోకేష్. స్వదేశంలో 88,196 మంది ఉన్నత చదువులు చదువుతున్నట్లు తెలిపారు. విదేశీ విద్య పథకం ఏ విధంగా అమలు చేయాలన్న విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు.
Also Read : Minister Subhash Interesting Comments : కార్మికుల సంక్షేమం కోసం కీలక సంస్కరణలు
