Minister Subhash : అమరావతి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Subhash) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు తీసుకు రావడాన్ని స్వాగతించారు. కొత్త గా తీసుకు వచ్చిన కార్మిక చట్టాలకు సంబంధించి భారత అభివృద్ధి దిశలో మైలురాయిగా పేర్కొన్నారు. ఆదివారం వాసం శెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు.1991 తర్వాత అత్యంత కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రత బలోపేతం అవుతుందని, అంతేకాకుండా వేతనాలకు సంపూర్ణ హామీ లభిస్తుందని చెప్పారు. సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ చట్టాలు ఆసరాగా ఉంటాయని అన్నారు వాసం శెట్టి సుభాష్.
Minister Subhash Praises Union Govt
పని చేసే సంస్థల్లో కార్మికులకు గౌరవం పెరిగేలా, హక్కులకు ప్రాధాన్యత కల్పించేలా కేంద్రం సంస్కరణలు తీసుకు వచ్చిందని చెప్పారు. ప్రధానంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున గిల్, ప్లాట్ ఫారం వర్కర్స్ కు మేలు చేకూర్చేలా చట్టం తీసుకు వచ్చిందన్నారు మంత్రి. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక రక్షణ కల్పించిందన్నారు. వీరితో పాట సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళలకు సమాన అవకాశాలు కల్పించేలా చూసిందన్నారు. భద్రత విస్తరణ చేసిందన్నారు. ఈ సంస్కరణలు ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థ వైపు దిశానిర్దేశం చేస్తాయనడంలో సందేహం లేదన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర సర్కార్ ను అభినందించారు వాసం శెట్టి సుభాష్.
Also Read : Nara Bhuvaneswari Interesting Comments : నారా భువనేశ్వరి సర్ ప్రైజ్ మహిళా కార్యకర్త ఖుష్
