Kavitha : హైదరాబాద్ : తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha). ఆమె మీడియాతో మాట్లడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ పరమైనవిగా కాకుండా విద్య, ఉద్యోగ , ప్రైవేట్ రంగాలలో సైతం బీసీలకు రిజర్వేషన్లు వర్తింప చేయాలని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూడడం మంచి పద్దతి కాదని హితవు పలికారు కల్వకుంట్ల కవిత. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి కేవలం తమ స్వలాభం కోసం బహుజనులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రిజర్వేషన్లు ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Kavitha Slams Congress
59 శాతానికి పైగా ఉన్న బీసీలను మోసం చేయాలని అనుకుంటే కుదరదని అన్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీలకు సంబంధించి జరిగే సర్పంచ్ ఎన్నికలలో బీసీ అభ్యర్థులకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు తెలియ చేస్తుందని ప్రకటించారు. గత కొన్నేళ్లుగా ఆయా సామాజిక వర్గాలు తీవ్ర నిరాదరణకు గురయ్యాయని వాపోయారు కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రిజర్వేషన్లు ఎలా ప్రకటించారో సమాధానం చెప్పాలని ఆమె కోరారు.
Also Read : KTR Clear Update on Deeksha Divas : దీక్షా దివస్ వల్లనే తెలంగాణ వచ్చింది
