Nara Lokesh : గుంటూరు జిల్లా – ఇన్నోవేషన్ హబ్స్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయని, వాటిని గుర్తించి నేర్చుకుంటే ఉపాధికి ఢోకా లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నారు లోకేష్ (Nara Lokesh). ప్రజారోగ్య ప్రమాణాలను మెరుగు పరచడానికి టాటా గ్రూప్‌తో కలిసి అభివృద్ధి చేసిన ‘సంజీవిని’ వంటి డిజిటల్ గవర్నెన్స్ చొరవలు, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను హైలైట్ చేశారు.
IT Minister Nara Lokesh Focus
భారతదేశంలో ఒకే పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు సిలికాన్ వ్యాలీకి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపక పోవడం వల్ల ఈ అంతరం ఉందని అన్నారు. యువకులు చాలా సృజనాత్మకంగా ఉంటారని, వారి లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రేరేపించ బడాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం పోర్టులో సహకార అవకాశాలను రష్యన్ ప్రతినిధి బృందం అన్వేషిస్తుందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. యువత ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించడం, స్థానికంగా వ్యవహరించడం ద్వారా వాటిని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఇన్నోవేషన్ హబ్ స్థానిక, అంతర్జాతీయ పరిష్కారాలను అందించే ఆలోచనల సమ్మేళనంగా మారుతుందని చెప్పారు.
Also Read : CM Chandrababu Sensational Comments : టెక్నాలజీ వల్ల జాబ్స్ వస్తాయే తప్పా పోవు
