Nara Lokesh : అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం, లక్షలాది అభిమానులను పొందిన నటుడిగా గుర్తింపు పొందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొణిదల పుట్టిన రోజు ఇవాళ. సెప్టెంబర్ 2 సందర్బంగా ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారని ప్రశంసించారు. ప్రజల కోసం తగ్గారని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు కృషి చేశారని పేర్కొన్నారు లోకష్. స్వంత తమ్ముడి కంటే తనను ఎక్కువగా అభిమానించారని, అండగా నిలిచారని , ఆయన కలకలాం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.
Minister Nara Lokesh Interesting Comments
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కు ఇద్దరు సోదరులు . ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా మరొకరు కొణిదల నాగబాబు. ఆయన ఇప్పుడు జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇదే సమయంలో ఎవరూ ఊహించని రీతిలో జనసేన ను స్థాపించారు. ఓ వైపు తన సోదరుడు చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. కానీ సక్సెస్ కాలేక పోయారు. చివరకు గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపేశారు. కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పని చేశారు.
Also Read : CM Chandrababu Warning : ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం
