Nadendla Manohar : అమరావతి : మంథా తుపాను ముంచుకు వస్తుండడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈమేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) స్పందించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు ముందు జాగ్రత్తగా సర్కార్ అన్ని చర్యలు చేపట్టిందన్నారు. అంతే కాకుండాకు ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచామన్నారు. ఇందుకు సంబంధించి నిత్యావసర సామాగ్రి కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) వస్తువుల స్టాక్ పొజిషనింగ్, ఇంధన జాబితా నిర్వహణ, వరి సేకరణ దశలు, సహాయ కేంద్రాలకు ఆహార సరఫరా చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు మంత్రి.
Minister Nadendla Manohar Comments
ఇదిలా ఉండగా వాతావరణ శాఖ ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అక్టోబర్ 28 సాయంత్రం కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇది చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 780 కి.మీ, విశాఖపట్నంకు దక్షిణ-ఆగ్నేయంగా 830 కి.మీ, కాకినాడకు ఆగ్నేయంగా 830 కి.మీ, గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 930 కి.మీ దూరంలో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంథా తుపాను బలపడి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటుతుంది. గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, తీరం వెంబడి 110 కి.మీ వేగంతో వీస్తుందని, కొన్ని జిల్లాల్లో చాలా భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి ఎన్ మనోహర్ తెలిపారు.
Also Read : K Kavitha Fired on Congress Govt : పోడు రైతులకు పరామర్శ కవిత భరోసా















