Minister N Md Farooq Alarming : హ‌జ్ యాత్ర కోసం 2,649 ద‌ర‌ఖాస్తులు

మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్ల‌డి

Hello Telugu - Minister N Md Farooq Alarming

Hello Telugu - Minister N Md Farooq Alarming

N Md Farooq : అమరావతి – గ‌తంలో కంటే ఈసారి ఏపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల తో హజ్-2026 యాత్ర కోసం భారీగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ (N Md Farooq) తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2 వేల 649 మంది యాత్రికులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్నారని వెల్ల‌డించారు. ఇందులో 2314 మంది అర్హులుగా గుర్తించబడ్డారని, 2019 తర్వాత ఏపీ నుండి హజ్ యాత్రకు వచ్చిన దరఖాస్తుల్లో ఇదే అత్యధిక దరఖాస్తులని స్ప‌ష్టం చేశారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుండి వెళ్లే వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు.

AP Minister N Md Farooq Key Commenst

హజ్ -2025 యాత్ర కు విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎన్నుకొని, తదుపరి సాంకేతిక కారణాలవల్ల హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల నుండి 72 మంది యాత్రికులు హజ్ కు వెళ్లడం జరిగిందన్నారు. దిగ్విజయంగా హజ్ పూర్తి చేసి వచ్చిన యాత్రికుల‌కు ఒక్కొక్కరికి లక్ష ప్రకారం 72 మందికి మంజూరు చేశామ‌న్నారు మంత్రి ఫ‌రూక్ (N Md Farooq). 24 గంటల వ్యవధిలోనే వారి బ్యాంకు అకౌంట్లకు మొత్తాన్ని జమ చేశామ‌ని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌డం జ‌రిగింద‌న్నారు.విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం పునరుద్ధరణ, హజ్-2026 కు దరఖాస్తు గడువు పెంపు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సకాలంలో జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ల‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

గన్నవరం పునరుద్ధరణతో పాటు, దరఖాస్తు గడువును కేంద్ర హజ్ కమిటీ పొడిగించిందన్నారు. గడువు పెంపుతో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని మొదటి ప్రాధాన్యతగా ఎన్నుకునేందుకు ప్రభుత్వ విస్తృత ప్రచారంతో హజ్-2026 దరఖాస్తుదారుల్లో 389 మంది యాత్రికులు విజయవాడ ఎంబార్కేషన్ కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మరో 627 మంది యాత్రికులు రెండవ ప్రాధాన్యత ఎన్నుకున్నారని తెలిపారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 128 మంది యాత్రికులు 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలవారని తెలిపారు. కాగా హజ్-2025 కు ఏపీ నుండి 1618 మంది హాజీలు వెళ్ళగా, వీరందరి సౌకర్యాల కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, సమన్వయంతో ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

Also Read : GHMC Commissioner Alarming : గ‌ణేష్ ఉత్సవాల నిర్వహణకు నిధులు ఫుల్

Exit mobile version